calender_icon.png 5 October, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా దివంగత మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి(కాక) జయంతి వేడుకలు

05-10-2025 04:27:27 PM

ముకరంపుర (విజయక్రాంతి): మాజీ కేంద్రమంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమాలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. వెంకటస్వామి చిత్రపటానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వెన్న రాజ మల్లయ్య, డిసిసి ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరవి అరుణ్ కుమార్, డిసిసి బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కొరివి అరుణ్ కుమార్ లు మాట్లాడుతూ.. వెంకటస్వామి పేదల పక్షపాతి అని, హైదరాబాద్ నగరంలో నిరుపేదలకు గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా పిలువబడ్డారని, కార్మిక శాఖ మంత్రిగా పనిచేసే కార్మికుల హక్కుల కోసం, పెన్షన్ సదుపాయాల కోసం పోరాడిన మహానీయుడని అన్నారు.

ప్రతి పేదోడి గుండెలో కాక చిరస్థాయిగా నిలిచిపోతాడని, రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షులుగా పలు పదవులు నిర్వహించి ప్రతినిత్యం పేదల కోసం పరితపించే వ్యక్తి వెంకటస్వామి అన్నారు. కార్యక్రమంలో నాయకులు కాడే శంకర్, వంగల విద్యాసాగర్, నాగుల సతీష్, కుంభాల రాజ్ కుమార్, గంగుల దిలీప్, పర్వత మల్లేశం, మాదాసు శ్రీనివాస్, చాంద్ పాషా, సిరికొండ శివప్రసాద్, యనమల మంజుల, కాంపల్లి కీర్తి కుమార్, నర్సింగం, తోట రవి, మామిడి సత్యనారాయణ రెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, సుంకరి గణపతి, వీర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.