05-10-2025 04:28:13 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు పూర్తయింది. ఆశావహులందరి పేర్లను పరిశీలించి షార్ట్ లిస్టు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ లిస్టులో నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మెహన్, మాజీ ఎంపీ ఎం. అంజన్ కుమార్ యాదవ్ పేర్లతో కూడిన తుది జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నలుగురి పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. చివరిగా ఏఐసీసీ జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖారారు చేసి ప్రకటించనున్నట్లు అధికార పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహాలను పర్యవేక్షించడానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావులతో కూడిన ఈ ప్యానెల్ తన సిఫార్సులను ఖరారు చేయడానికి ముందు స్థానిక నాయకులు కార్యకర్తలతో మూడు రోజుల సంప్రదింపుల కార్యక్రమాన్ని చేపట్టింది.