05-10-2025 04:44:51 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని క్లబ్ రోడ్డులోని లంబాడి తాండాకు చెందిన రాతోడ్ మణికంఠ(20) అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించాడని ఎస్సై సురేష్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మంచిర్యాలలో ఐటిఐ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత పది రోజుల నుండి ఇంట్లో తల్లితండ్రులను బైక్ కోనివ్వమని వెంటపడుతున్నాడు.. నిన్న సాయంత్రం కూడా బైక్ కొనియ్యాలని కోరగా తల్లితండ్రులు తర్వాత కొనిస్తామని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని తండ్రి దారాసింగ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.