calender_icon.png 5 October, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల మహాసభలను జయప్రదం చేయండి

05-10-2025 04:41:59 PM

నకిరేకల్ (విజయక్రాంతి): ఈ నెల 7న నకిరేకల్ పట్టణంలో నిర్వహించే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నాల్గవ మండల మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని నోముల గ్రామంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమం కోసం కల్లుగీత కార్మిక సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ మహాసభలకు గీత కార్మిక సంఘాల ప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు గుడు గుంట్ల బుచ్చి రాములు, కార్యదర్శి కొప్పుల అంజయ్య, మండల సహాయ కార్యదర్శి యరకలి అంజయ్య, మండల కమిటీ సభ్యులు పొడిచేటి వీరయ్య, నోముల సొసైటీ అధ్యక్షులు గుండగోని జంగయ్య గౌడ్, ఉపాధ్యక్షులు కొప్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.