05-10-2025 04:33:58 PM
నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్..
ఉప్పల్ (విజయక్రాంతి): ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా శాంతి భద్రతాలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ అన్నారు. రాచకొండ కమిషనర్ సుదీర్ బాబు ఆదేశాల మేరకు పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు. జిల్లా పరిషత్ మండల పంచాయతీ సాధారణ ఎన్నికల సందర్భంగా గత నెల 29 నుండి అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిషేధిత చర్యను ఆయన వెల్లడించారు. ముందస్తుగా అనుమతి లేకుండా ఎటువంటి ప్రజాసభలు సమావేశాలు ప్రదర్శన నిర్వహించరాదని ఆయన పేర్కొన్నారు.
హానికరమైన ఆయుధాలు వెంట తీసుకురావడం నిషేధమని ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించిన ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. డీజేలు మ్యూజిక్ పాటలు ప్రసంగాలు పోలీస్ అనుమతి లేకుండా పెట్టవద్దని ఆయన పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలపై నిషేధగులను ఉల్లంఘించిన ఏ వ్యక్తి అయినా హైదరాబాద్ నగర చట్టం 1348 ప్లస్ చట్టం నెంబర్ ప్రకారం చట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.