calender_icon.png 31 July, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

31న కాళేశ్వరం కమిషన్ నివేదిక

29-07-2025 01:53:31 AM

న్యాయపర అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): మేడిగడ్డ, అన్నారం, సుంది ళ్ల బరాజ్‌ల కుంగుబాటు, అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ పూర్తి అ యినట్టు సమాచారం. ఈ విచారణ కు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు పీసీ ఘోష్ కమిషన్ సర్వం సిద్ధం చేస్తున్న ట్టు తెలుస్తోంది.

ఈనెల 31న జస్టిస్ ఘోష్ కమిషన్ పదవీకాలం ముగియనున్నది. దీంతో అదేరోజున కమి షన్ వద్ద నుంచి తుది నివేదికను నీటిపారుదల శాఖ తీసుకోనున్నట్టు స మాచారం. ఆదివారం హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పీ సీ ఘోష్ ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చే ముందు లీగల్ అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.