calender_icon.png 31 July, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులను ఆదుకుంటాం

29-07-2025 01:51:51 AM

చిరుత దాడి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పర్ణికరెడ్డి 

కోయిల్ కొండ జూలై 28 : గత రెండు రోజుల క్రితం కొత్తపల్లి గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులపై చిరుత దాడి చేసింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను ప్రత్యేకంగా పరామర్శించారు.

బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని ఎవరు అధర్య పడకూడదు అని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఒంటరిగా ఆ ప్రాంతాల్లో తిరగరాదని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.