calender_icon.png 25 May, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనమే జనము సరస్వతి పుష్కరాలకు కిక్కిరిసిన కాళేశ్వరం

25-05-2025 11:31:06 AM

మహదేవపూర్,(విజయక్రాంతి): సరస్వతి పుష్కరాలకు(Kaleshwaram Saraswati Pushkaralu) 11వ రోజు భక్త జనసందోహంతో కాళేశ్వరం క్షేత్రం జన రంజకంగా మారింది. సరస్వతి నదీ పుష్కరోత్సవాలు 11వ రోజు కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున నుండే భక్తుల రద్దీ పెరిగి, పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరం చేరుకుంటూ పుష్కర స్నానాలను ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమం నదీతీరంలో పవిత్ర పుణ్య స్నానాలు చేసి,  భక్తులు స్వామి వారి దర్శనానికి దేవాలయానికి చేరుకుంటున్నారు. స్నానానంతరం భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయానికి చేరుకుని దైవదర్శనం చేసుకున్నారు. దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం పుష్కర ఏర్పాట్లను, దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) ఏర్పాట్లుపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.  భక్తుల సౌకర్యార్థం ఘాట్ వద్ద బట్టలు మార్చుకునే గదులు,  మంచినీరు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, పోలీసు సహాయం, అపరిశుభ్రత నివారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. తాత్కాలిక బస్ స్టాండ్ నుండి సరస్వతి ఘాట్ వరకు, అక్కడి నుండి దేవాలయం సమీపం వరకు ఆర్టీసీ, సింగరేణి ఉచిత షటిల్ బస్సులు ఏర్పాటు ద్వారా భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. పరిశుభ్రత, భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ  నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు. పుష్కర సందర్బంగా అన్నదాన కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు, సాయంత్రం సరస్వతి నవరత్న మాలా హారతి, సాంస్కృతిక భక్తి ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి.

ప్రజలు పుష్కరాలను ఆచార సంప్రదాయాలకు తగ్గట్టు నిర్వహిస్తూ, నిబంధనలు పాటిస్తూ పాల్గొనాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుండే భక్తుల రద్దీ కొనసాగుతుంది. కాలేశ్వరం అడవిలోని అన్నారం ముల మలుపు నుండి అన్నారం ,నాగ పెళ్లి, చండ్రుపల్లి, మద్దులపల్లి, పలుగుల క్రాస్ కార్డ నుండి పూసుకుపల్లి మీదుగా వెళుతున్న వందే వాహనాలు పుసుకువల్లి నుండి కాలేశ్వరం వరకు నిలిచిపోయి పుష్కర భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడవిలో నీళ్ళు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూసుకుపలి నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైవేటు బస్సులు సరిపోక కొందరు భక్తులు కాలినడకనే నడుచుకుంటూ సరస్వతి పుష్కర ఘాటుకు చేరుకుంటున్నారు. పుష్కర 

స్నానానంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి దర్శనంలో క్యూ లైన్ లో కూడా కిక్కిరిసిపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు రెండు గంటల వరకు దర్శన భాగ్యం లభించడం లేదు. క్యూలైన్లో ఏర్పాటులో దేవాదాయ శాఖ అధికారులు సరైన ప్రణాళికలు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యూలైన్లో కిక్కిరిసిపోయి బక్కులు భక్తుల దివ్యదర్శనానికి చాలా సమయం పడుతుంది. అధికారులు శుభ్రత, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ.అన్నదానాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.