calender_icon.png 25 May, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

25-05-2025 10:57:53 AM

కామారెడ్డి జిల్లాలో దారుణం ఘటన 

కామారెడ్డి,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో(Kamareddy District) దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కుమారుడు తన తండ్రిని గొడ్డలితో నరికి చంపిన వైనం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయ్యపల్లి తండాలో వెలుగు చూసింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయ్యపల్లి తండా కు చెందిన దేవసోతు పకీర (46) కు 25 సంవత్సరాల క్రితం పంగి అనే మహిళతో వివాహమైంది. వీరికి ప్రకాష్ తో పాటు కూతురు కూడా ఉంది. దేవా పరమల్లతండా చెందిన మరో మహిళను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.

దీంతో తండ్రి కుమారుల మధ్య గొడవలు తరచుగా జరుగుతున్నాయి. రెండో పెళ్లి చేసుకోవద్దని కుమారుడు కోరిన తండ్రి వినక పోవడంతో శుక్రవారం అర్ధ రాత్రి తండ్రి దేవ సోత్ పకీరను కొడుకు ప్రకాష్ గొడ్డలితో నరికి చంపారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లింగంపేట పోలీసులు ఆదివారం సంఘటన స్థలా నీకి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తండ్రి కొడుకుల మధ్య గొడవనే హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లింగంపేట పోలీసులు తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. కన్న కొడుకే తండ్రిని గొడ్డలితో నరికి చంపడం దారుణ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అయ్యపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది.