27-06-2024 12:31:21 AM
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ‘కల్కి’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. దేశ వ్యాప్తంగా సినిమా గురించి చర్చ సాగుతుంటే.. ప్రచార కార్యక్రమాల్లో కనబడని నాగ్ అశ్విన్, సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ లైవ్‌లో ‘కల్కి’ క్లుమైక్స్.. సినిమాలో నటించిన ప్రభాస్‌కి సైతం షాక్ ఇవ్వనుందంటూ పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్నట్టు “కల్కి’లో యువ హీరోలైన నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లతో పాటు మరికొందరు తారలు భాగమైనట్టు తెలిపిన ఆయన, 20 నిమిషాల తర్వాత భైరవ పాత్ర తెరమీదికి రానుంది.
ఆ సన్నివేశాలకు థియేటర్లు అరుపులు కేకలతో హోరెత్తిపోతాయ”న్నారు. కొనసాగిస్తూ ‘కల్కి థీమ్ గీతానికి అందరూ ముగ్దులవుతారన్న ఆయన, సినిమా క్లుమైక్స్ ప్రభాస్‌కి సైతం షాక్ ఇవ్వనుందంటూ” సినిమాపై అంచనాలు మరింత పెంచారు. ఇందులో పాల్గొన్న ప్రభాస్ “కల్కిలో భాగమైన దుల్కర్, విజయ్‌లకు ధన్యవాదాలు చెబుతూ.. సినిమా విడుదల తర్వాత పది రోజులు విరామం తీసుకుని ‘కల్కి 2’ పనులు ఆరంభించమంటూ” దర్శకుడికి సూచించారు.