13-11-2025 12:03:23 PM
హైదరాబాద్: నేరేడ్‌మెట్ పోలీసులు(Neredmet police) బుధవారం రాత్రి బాడీ మసాజ్ సెంటర్‌పై దాడి చేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. మసాజ్ సెంటర్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మసాజ్ సెంటర్ యాజమాన్యం మహిళా మసాజర్లను నియమించుకుని, పురుషులను ఆ ప్రదేశానికి రప్పించి, క్రాస్ మసాజ్‌ను ప్రోత్సహిస్తోంది. నిర్దిష్ట సమాచారం మేరకు నేరేడ్‌మెట్ పోలీసులు డిఫెన్స్ కాలనీలో ఉన్న కేంద్రంలో దాడి చేసి, కేంద్రంలో ఉన్న ఇద్దరు మసాజ్ సెంటర్ నిర్వాహకులను పట్టుకున్నారు. ఈ ఘటనసై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.