calender_icon.png 9 November, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ లో జాగృతి జనం బాట

09-11-2025 06:13:45 PM

ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా

ప్రస్తుతం ప్రజల సమస్యలపైనే పోరాటం

పాలక పక్షం, ప్రతిపక్షం పనిచేయటం లేదు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జాగృతి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): సకల జనులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొందరిది కాకుండా అందరిదీ కావాలని, అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే తన లక్ష్యమని హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Jagruthi President Kalvakuntla Kavitha) అన్నారు. అనంతరం మాట్లాడుతూ.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని రూ.11 వందల కోట్ల నుంచి రూ.17 వందల కోట్లకు పెంచారు. ఒక బినామీ కంపెనీకి పనులు ఇచ్చారు. అది హరీష్ రావు బినామీ కంపెనీ దానిపై విజిలెన్స్ విచారణ వేసిన ప్రభుత్వం ఎందుకు నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలు, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. గతంలో మాదిరిగా స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరపాలని లేదంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల వారసులు వారి చుట్టాలు రాజకీయాల్లోకి వస్తున్నారని అలా రావడం వలన పేద ప్రజలకు సేవ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు.

బీసీల విషయంలో మేము వారి వెంటే కొనసాగుతామని చెప్పారు. మేము ప్రస్తుతం రాజకీయం చేయడం లేదని, ఇప్పుడైతే ప్రజల సమస్యలపైనే పోరాటం చేస్తామని అన్నారు. ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన ఈ ప్రాంతంలో పుట్టిన రాణి రుద్రమదేవి, సమ్మక్క, సారలమ్మల ధైర్యంతో ముందడుగు వేస్తానని తెలిపారు. వరంగల్ అంటే రైల్వే అబ్ అని కానీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఖండించారు. రైతులు తమ ధాన్యాన్ని వేరే చోట అమ్ముకునేలా చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారని డిమాండ్ చేశారు. వరంగల్లో ఈస్ట్, వెస్ట్ వరదలు ముంచెత్తాయని వరద బాధితుల సహాయార్థం సీఎం వచ్చి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పినా గానీ ఇంతవరకు ఏ ఒక కుటుంబానికి సహాయం అందలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ట్రై సిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎందుకు లేదు అని విమర్శించారు.

వరంగల్ బస్టాండ్ కోసం 70 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం అంతా తవ్వేసారని, డంప్ యార్డ్ వరంగల్ లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారని, మహిళల విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ లేదంటే సిగ్గుపడాలని వారు పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీకి వెళితే విద్యార్థులు జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ వేయాలని, గ్రూప్స్ లో ఎలాంటి లోపల లేకుండా నిర్వహించాలని అంతేకాకుండా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఎంజీఎంలో రోజువారి మెయింటెనెన్స్ కోసం లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాయని, ప్రభుత్వం పైస ఇవ్వకపోవడంతో సూది, దూది కొనే పరిస్థితి కూడా లేదని, ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరైన బెడ్ లేక ఒక బెడ్డుకు ఇద్దరు పేషెంట్లు చూసానని, డాక్టర్లు, నర్సులకు వారు చేస్తున్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ జాగృతి తరఫున గతంలో కమిటీలు ఉండేవని వాటిని మళ్లీ బలంగా తయారు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.