calender_icon.png 9 November, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే

09-11-2025 06:07:17 PM

ఈనెల 15న కామారెడ్డిలో బీసీ ఆక్రోష సభను విజయవంతం చేయాలి..

42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య..

కామారెడ్డి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ డిక్లరేషన్ చేసిందని దానికి కట్టుబడి ఉండి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహంలో బీసీ ఆక్రోష సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు పరచాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 23 శాతం రిజర్వేషన్ నుంచి 42 శాతానికి పెంచుతామని, విద్య, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి బీసీల అభివృద్ధి కోసం సంవత్సరానికి 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదన్నారు.

బీసీల అభ్యున్నతికి 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నమన్నారు. ఒక్కో మండలానికి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి నవోదయ విద్యాలయాలలో అందే స్టాండర్డ్ విద్యను అందిస్తామని చెప్పారన్నారు. జిల్లాకు ఒక బీసీ కళాశాల ఏర్పాటు చేస్తామని, కులవృత్తులు, కుల సంఘాలకు చేయూతనిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే కులగనన కోసమే ఏడాది సమయం తీసుకున్నారన్నారు. నాడు ఆర్టికల్ 342 ఏ మూడు కింద చట్టం చేయవచ్చని చట్టాన్ని తను రాసిచ్చాను అని తెలిపారు. దాని ప్రకారం కాకుండా వేరే విధంగా ఇచ్చారన్నారు. రిజర్వేషన్ రాద్ధాంతం జరుగుతుంటే ముసాయిదా డ్రాఫ్ట్ ఇచ్చానని తెలిపారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్ పెంచుకోవడానికి చట్టాన్ని రాసి ఇస్తే దానిని చూడలేదన్నారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇదొక్కటే మార్గమని సీఎం పిలుచుకుని ముసాయిదా తయారు చేసుకుని రెండు బిల్లులు తయారు చేసినట్లు తెలిపారు. ఈ రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్కు పంపిస్తే ఆయన కేంద్రానికి పంపారాని తెలిపారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టం సవరణ  చేస్తూ ఇచ్చిన జీవోలను సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధంగా ఉన్నాయనిస్తే సుప్రీం కు వెళ్లారని తెలిపారు. దీనికి తొమ్మిదవ షెడ్యూల్ చేర్చడమే పరిష్కారం మార్గమని బీసీలను చైతన్యం చేయడం కోసం సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము ఏ పార్టీ సంఘానికి అనుబంధం కాదని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. రిజర్వేషన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిన్సియర్గా ప్రయత్నం చేయలేదని ప్రధాని కలవలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. బిజెపి బీసీల పార్టీ కాదన్నారు. బీసీ రిజర్వేషన్ నమోదు చేస్తే కాంగ్రెస్కు పేరు వస్తుందని, తద్వారా అన్ని రాష్ట్రాల నుంచి ఏ డిమాండ్ పెరుగుతుందని కేంద్రం రిజర్వేషన్ అమలు చేయడం లేదన్నారు. బిఆర్ఎస్ కు బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు.

2017 లోనే బిఆర్ఎస్ కుల గానా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు ఆలోచించలేదని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ కూడా చారిత్రాత్మక తప్పిదం చేసిందన్నారు. బిజెపితో కాంప్రమైజ్ ఐ 33 శాతం నుంచి 23 శాతానికి తగ్గించుకుందన్నారు. 23% తోనే వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈనెల 15 తర్వాత అన్ని జిల్లాలలో బీసీ ఆక్రోష సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని తెలిపారు. అనంతరం ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే ఆక్రోష మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బీసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్, జిల్లా సీనియర్ న్యాయవాది క్యాతం సిద్ధి రాములు, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు మర్కంటి భూమన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ యాదవ్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు విట్టల్, గౌడ సంఘం జిల్లా కార్యదర్శి బాలార్జున్ గౌడ్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, బిసి న్యాయవాదుల జనరల్ సెక్రెటరీ దేవరాజు గౌడ్, చేతివృత్తుల సంఘం జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.