calender_icon.png 21 May, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణలక్ష్మిఆడబిడ్డలకు వరం

21-05-2025 12:56:03 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు

నిజాంపేట(రామాయంపేట), మే 20: కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పేదింటి ఆడపడుచులకు వరంలాంటిదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పేర్కొన్నారు. మంగళవారం నిజాంపేట మండల కేంద్రంలో కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

ప్రజాపాలన ప్రభుత్వంలో రైతులు, మహిళలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో మహిళలు, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, సీఎం రేవంత్రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళలకు గృహజ్యోతి, రూ.500 గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట, నిజాంపేట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.