calender_icon.png 21 May, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

21-05-2025 12:55:26 PM

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయింది. వాతావరణ శాఖ సూచన మేరకు కోదాడలో ల్యాండింగ్ (Emergency Landing) చేసినట్లు అధికారులు వెల్లడించారు. హుజూర్ నగర్ మండలం(Huzurnagar Mandal) మేళ్లచెరువులో మంత్రి ఉత్తమ్ హెలికాఫ్టర్ ల్యాండ్ కావాల్సిన ఉంది. మబ్బులు, గాలివానతో మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ల్యాండింగ్ చేశారు. కోదాడ నుంచి హుజూర్ నగర్ వరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 16 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లారు.