calender_icon.png 21 May, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ

21-05-2025 02:11:07 PM

ముత్తారంలో వర్ధంతి వేడుకల్లో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ

ముత్తారం, (విజయక్రాంతి): దేశానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతి(Rajiv Gandhi death anniversary) సందర్భంగా మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళర్పించారు. ఈ సందర్భంగా దొడ్డ బాలాజీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్యలు మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ భారతదేశానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన మహా నాయకుడని,18 ఏండ్లు వచ్చిన వారికి ఓటు హక్కు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేశారని ఆయన కొనియాడారు, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన పునాదులే కారణమని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఏలువాక కొమురయ్య, డైరెక్టర్లుట లింగారావు, అలగం పాపయ్య, ముత్తారం మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్కం ప్రభాకర్, ఆకోజ్ అశోక్, పింగిలి రవీందర్ రెడ్డి, కుక్కల చందు తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు.