calender_icon.png 21 May, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదురుకాల్పులపై స్పందించిన ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం

21-05-2025 01:42:29 PM

రాయ్‌పూర్: ఎదురు కాల్పులపై ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ వర్మ(Deputy CM Vijay Sharma) స్పందించారు. నారాయణపూర్-బీజాపూర్ మధ్య ఇంద్రావతి అభయారణ్యంలో ఎన్ కౌంటర్ జరిగిందని విజయ్ వర్మ స్పష్టం చేశారు. రెండ్రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని ఆయన సూచించారు. కూంబింగ్ లో భాగంగా నక్సల్స్, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం అందినట్లు విజయ్ వర్మ పేర్కొన్నారు. ఎదురుకాల్పుల్లో జవాన్ గాయపడ్డారు.. ప్రాణాపాయం లేదని ఆయన వివరించారు. కాల్పుల్లో అసిస్టెంట్ కానిస్టేబుల్ మరణించారని ఛత్తీస్ గఢ్ ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

బుధవారం ఉదయం ఛత్తీస్‌గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్(Chhattisgarh encounter) లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణ పూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు ప్రకటించారు. ఈ భారీ ఆపరేషన్ లో నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ డీఆర్ జీ బలగాలు పాల్గొన్నా యి. ఎన్ కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు తెలిపారు. నేడు జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాధ్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి.