calender_icon.png 21 May, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘట్‌కేసర్‌లో 58 కిలోల గంజాయి పట్టివేత

21-05-2025 12:57:11 AM

ఐదుగురు అరెస్టు

మేడ్చల్, మే 20 (విజయ క్రాంతి) : ఒరిస్సా నుంచి ఘట్కేసర్ మీదుగా కారులో 58 కేజీల గంజా యిని తరలిస్తుండగా ఎక్సై జ్ పోలీసులు పట్టుకుని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మంగళవా రం నారపల్లి లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాల యంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మేడ్చల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ విలేకరుల సమా వేశం లో వివరాలు వెల్లడించారు.

జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందంరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘట్కేసర్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్, సిబ్బంది, సోదాలు జరుపుతుండగా కర్ణాటక కు చెందిన KA 39 M 2162 నెంబర్ గల కారును తనిఖీ చేయగా అందులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.

వారిని వివరాలు అడగగా కర్ణాటక బీదర్ చెందిన గోవింద్ తప్సలే (36), గజానంద్ (21), పవన్ (25), ఆకాష్ (32), అదిలాబాద్ జిల్లా అంబేద్కర్ నగర్ కు చెందిన తోరత్ రాహుల్ (31) గా తెలిపారు. వారి కదలికలు మరింత అనుమానాస్పదంగా ఉండటంతో కారును తనిఖీ చేయగా గోధుమ రంగు టేప్‌తో చుట్టిన గంజాయి బండిల్స్ కారు డిక్కీలో కనిపించాయి.

ఒక్కొక్క బండిలు తూకం వేయగా సుమారుగా 2కిలోల వరకు ఎండు గంజాయి ఉందని,మొత్తం 29 బండిల్స్ ఉన్నాయి. మొత్తంగా 58.88 కిలోల ఎండు గంజాయి ఉంది. వెంటనే ఆ నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా అందరూ కలిసి బీదర్ నుండి గజపతి జిల్లా, ఒరిస్సా రాష్ట్రంలో గల సుమన్ జానీ వద్దకు వెళ్లి అక్కడ ఎండు గంజాయిను ఒక్కొక్క కిలో ను రూ.1900కు కొనుగోలు చేసి కారులో పెట్టుకుని భద్రాచలం, సూర్యాపేట, పంతంగి టోల్గేట్ ల ద్వారా ఓఆర్‌ఆర్ మీదుగా ఘట్కేసర్ టోల్గేట్ పరిసర ప్రాంతంలో ఎండు గంజాయిను రవాణా చేస్తున్నట్లు తెలిపారు.

నిందితుడు రాహుల్ ని విచారించగా పూణేలో నివాసం ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తి బీదర్ కు చెందిన నలుగురు నిందితులు ఒకే గ్రామానికి చెందినవారని ఆ నలుగురిని రాహుల్ కి ఫోన్ ద్వారా పరిచయం చేశారు. రాహుల్ ఎండు గంజాయి కిలో రూ. 5వేల చొప్పున కొనుగోలు చేయడానికి అంగీకారం కుదుర్చుకొని ఘట్కేసర్ ఓఆర్‌ఆర్ మీదుగా గంజాయిని ఆదిలాబాద్ జిల్లాకు తరలించు కునేందుకు డీల్ కుదుర్చుకున్నాడు.

ఈ క్రమంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు. దాదాపు రూ. 23,55,200 విలువైన ఎండు గంజాయి, ఒక మారుతి కారు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన సుమన్ జానీ, అభిషేక్ లు పరారీలో ఉన్నట్టు తెలిపారు. చాకచక్యంగా గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకున్న ఘట్కేసర్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జె.రవి, సంగీత, నందిని, సిబ్బందిని డీసీ దశరథ్ అభినందించారు.