21-05-2025 12:54:53 AM
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, మే 20(విజయ క్రాంతి):నీవు ధర్మాన్ని కాపాడు... అది నిన్ను కాపాడుతుందని ప్రపంచానికి చాటిన దైవం శ్రీకృష్ణుడని బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ పే ర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 - సుభాష్ నగర్ డివిజన్ పైప్ లైన్ రోడ్డు లో శ్రీ కృష్ణ ప్రణామి సేవా సమితీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీ సదానంద్ జీ మహారాజ్ పర్యవేక్షణలో నూ తనంగా నిర్మించనున్న శ్రీకృష్ణ భగవాన్ దేవాలయానికి బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ శంకుస్థాపన గావించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగవద్గీత అనేది ఒక ఇతిహాసం మాత్రమే కాదని, మానవుని జీవన విధానానికి మార్గదర్శిక, భగవద్గీత పఠనం ద్వారా మనలోని చెడును తొలగించుకొని సన్మార్గం వైపు జీవన విధానం మారుతుందని అ న్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవ స్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ది రాములు, నరేందర్ రెడ్డి, కాలే నాగేష్, కాలే గణేష్, బాల మల్లేష్, మాధవ రెడ్డి, సుమేర్ సింగ్,
దేవాలయ కమిటీ చైర్మన్ నరేష్ మిట్టల్, ఉపాధ్యక్షులు రాంనారాయణ జీ మిట్టల్, ప్రధాన కార్యదర్శి గణేష్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శి ప్రదీప్ అగర్వాల్, కోశాధికారి చేతన్ శర్మ, ముఖ్య సలహాదారులు జోగి రామ్ జి అగర్వాల్, రాజీవ్ అగర్వాల్, సవర్మాల్ అగర్వాల్, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.