19 August, 2026 | 1:36 AM

రైస్ మిల్లుల బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి

19-08-2026 12:00 AM

నస్పూర్, ఆగస్టు 18 :జిల్లాలోని రైస్ మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావలసిన బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అన్నారు. మంగళ వారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఛాంబర్ లో బి సెక్షన్ పర్యవేక్షకులు మధుసూదన్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి సంబంధిత మండలాల తహ సిల్దార్లు, జిల్లాలోని రైస్ మిల్లుల నుంచి ప్ర భుత్వానికి రావాల్సిన బకాయిలు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వసూలు చేసే అం శంపై సమావేశం నిర్వహించారు.

రెవెన్యూ రికవరీ యాక్ట్లోని నిబంధనలు, బకాయిల వసూళ్లకు అనుసరించవలసిన విధివిధానాలు, మిల్లుల వారీగా పెండింగ్లో ఉన్న బకాయిల మొత్తాలపై రికన్సిలియేషన్, కోర్టు కేసులకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.