‘కల్యాణ లక్ష్మి’ని కొనసాగించాలి
19-08-2026 12:02 AM
గజ్వేల్, ఆగష్టు18: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. పథకాలను రద్దు చేసే కుట్రలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి గజ్వేల్లో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.13 వేల కోట్ల ఆర్థిక సాయం అందించిందని తెలిపారు. పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే సాయం అందించాలని, ఎన్నికల హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.






