24 April, 2026 | 6:44 PM

Breaking News

డీసీఎం, ద్విచక్ర వాహనం ఢీ... వ్యక్తి మృతి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలను బేషరతుగా వెంటనే పరిష్కరించాలి   •   ఇల్లందు పట్టణంలో జరుగు అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయండి   •   విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •   పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •  

కళ్యాణి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

27-07-2025 08:27 PM

ఎగువ నుంచి వస్తున్న నీరు..

నిండుకుండలా మారిన కళ్యాణి ప్రాజెక్టు..

కామారెడ్డి (విజయక్రాంతి): గత నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి మండలం కళ్యాణి ప్రాజెక్టు(Kalyani Project)లోకి వరద నీరు వచ్చి చేరింది. నిండుకుండలా మారడంతో రెండు గేట్లను ఆదివారం ప్రాజెక్టు అధికారులు ఎత్తివేశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు నిండడంతో రెండు గేట్లను ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. పై నుంచి వస్తున్న వరద నీటితో సమానంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి అదే మోతాదులో నీటిని వదులుతున్నట్లు తెలిపారు. 330 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.