రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం
రూ.30 లక్షల నిధులతో ధాన్యాల
నిలువ గోదాం నిర్మాణ భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
అడ్డాకుల మార్చి 13: అడ్డాకుల మండల కేంద్రంలో శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృతంగా ప్రకటించడం జరిగింది. తె లంగాణ ప్రభుత్వం మార్చి 6 నుండి జూన్ 12 వ రకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 99 రోజులపాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో ము ఖ్యంగా విద్య ,వైద్యం పేదలకు, మేలు చేకూరుస్తుం ది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ క్యాంప్ అడ్డాకుల పి హెచ్ సి లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొని డాక్టర్లను మరియు రోగులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా 99 రోజులు ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ఏప్రిల్ 2 నుండి ప్రతి గ్రామంలో గ్రామసభలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలపై నిర్ణయాలు క్షేత్రస్థాయిలో చెయ్యాలని ప్రభుత్వం రేవంత్ రెడ్డి కృషి చేస్తుందన్నారు.
అదేవిధంగా రైతులకు రైతు సంక్షేమమే మా ప్రభుత్వం ధ్యే యం పండించిన పంట నిల్వ ఉంచుకోవడానికి మండల కేంద్రంలో 30 లక్షల నిధులు కేటాయించామని గోదాం నిర్మించడానికి శంకుస్థాపన చేశామని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ప్రోసిడింగ్లతోపాటు, కల్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, లబ్ధిదారులకు చెక్కులు అందించారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోట శ్రీహరి, సర్పంచ్ దశరథ రెడ్డి, మాజీ ఎంపీపీ నాగార్జున రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ మోహన్ రెడ్డి, జిల్లా కిషన్ సేల్ అధ్యక్షుడు నాగిరెడ్డి, కా రెడ్డి దేవేందర్ రెడ్డి, రంజిత్, శేఖర్ రెడ్డి, హేమ వర్ధన్ రెడ్డి, శకుంతలమ్మ, బాలయ్య, నాయకులు పాల్గొన్నారు.




