21 March, 2026 | 1:34 PM

Breaking News

తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •  

దృశ్యం తరహా చిత్రం కామాఖ్య

21-03-2026 12:00 AM

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ‘కామాఖ్య’. వడ్డేపల్లి శ్రీవాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో ఒక ప్రాజెక్టు విషయంలో ఆలస్యమైనప్పుడు అమ్మవారి పవర్ ఏంటో నాకు వ్యక్తిగతంగా అనుభవం జరిగింది.

అందుకే టైటిల్ ‘కామాఖ్య’ అని చెప్పగానే ఒప్పుకున్నా” అన్నారు. కథానాయకి సమైరా మాట్లాడుతూ.. “ఇది నా ఫస్ట్ మూవీ. నా తొలి చిత్రం ఫిమేల్ సెంట్రిక్‌గా, పవర్‌ఫుల్ టైటిల్ ఉండడం అదృష్టంగా భావిస్తున్నా” అన్నారు. ‘ఇప్పటివరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేద’ని అభిరామి చెప్పారు.

డైరెక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ.. “దర్శకుడిగా నా తొలి చిత్రం ‘చిరంజీవా’. ఆ చిత్రంలో యమధర్మరాజుకు ఒక గుడి ఉందని, అది తెలంగాణలోనే ఉందని చెప్పాం. కామాఖ్య అమ్మవారి నేపథ్యంలో ఈ తాజా చిత్రాన్ని తీసుకువస్తున్నాం. ‘దృశ్యం’ సినిమా తరహాలో ఉండే మంచి థ్రిల్లర్ ఇది” అని తెలిపారు. ‘ఇది స్పెషల్ ప్రాజెక్టు’ అని నిర్మాత వాణినాథ్ తెలిపారు.