11 March, 2026 | 9:12 PM

ఓయూ ఆవరణలో ఆద్యకళ మ్యూజియం ఏర్పాటుకు అందరూ సహకరించాలి

04-06-2025 01:05 AM

- ఎమ్మెల్సీ కోదండరాం, సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్, రామచంద్రమూర్తి 

ఖైరతాబాద్; జూన్ 3 (విజయ క్రాంతి) : ఆధ్య కళా ఫౌండేషన్ సేకరించిన ప్రజా సాంస్కృతిక వస్తు భాండాగారాన్ని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సహాయ సహకారాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న తరు ణంలో కొంతమంది అపోహలతో ఆధ్య కళ మ్యూ జియం నిర్మాణం చేయకూడదని అడ్డుకోవడం శోచనీయమని ప్రము ఖులు అభి ప్రాయపడ్డారు.

ఈ మేరకు సోమాజిగూడ, ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, కే శ్రీనివాస్, పరిశోధకులు సన్నిధానం నరసింహ శర్మ, ప్రముఖ సంపాద కురాలు కొండవీటి సత్యవతి పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.

ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. స్వయంగా రాష్ట్రపతి ఆద్యకళ మ్యూ జియంను రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేయమని అడిగా రని అలాగే ఫ్రాన్స్ వారు కూడా తమ దేశంలో మ్యూజియంను ఏర్పాటు చేయమని అడిగినా కూడా మ్యూజియం కేవలం తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు బలంగా సంకల్పించారని అన్నారు. కావున అపోహలకు తావివ్వకుండా ఉస్మానియా విశ్వ విద్యాలయంలోనే మ్యూజియం ఏర్పాటుకు అందరూ సహకరించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు.