calender_icon.png 12 November, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తక్షణమే ముగియాలి: హారిస్

11-09-2024 09:41:23 AM

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్ జరిగింది. హారిస్, ట్రంప్ మధ్య నేషనల్ కాన్ స్టిట్యూషన్ సెంటర్ వేదికగా చర్చ జరిగింది. అమెరికా ప్రజలందరినీ ఏకం చేసే అధ్యక్షురాలిని అవుతానని కమలా హారిస్ తెలిపారు. తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని హారిస్ వెల్లడించారు. కానీ అమాయకులైన ఎంతో మంది పాలస్తీనియన్లు వృతిచెందారని ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి ముగింపు పలకాల్సి ఉందని హారిస్ పేర్కొన్నారు.

తమను తాము కాపాడుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని తెలిపారు. హమాస్ 1200 మంది ఇజ్రాయెలీలను ఊచకోత కోసిందని హారిస్ విమర్శించారు. హమాస్ ఉగ్రవాదులు మహిళలపై అఘాయిత్యాలు చేశారని మండిపడ్డారు. గాజాను పునర్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విదేశీ విధానంలో ట్రంప్ చాలా బలహీనంగా ఉన్నారని వెల్లడించారు. ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ట్రంప్ అధ్యక్షుడైతే కీవ్(ఉక్రెయిన్)తో పుతిన్ కూర్చొంటారని తెలిపారు. తమ మద్దతు వల్లే ఉక్రెయిన్ ఇంకా స్వేచ్ఛగా ఉందని పేర్కొన్నారు.