15 March, 2026 | 8:50 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

కమల సమర్థురాలు

09-11-2024 01:28 AM

అందుకే బైడెన్ రేసు నుంచి వైదొలిగారు: వైట్‌హౌస్

వాషింగ్టన్ డీసీ, నవంబర్ 8: అమెరికా అధ్యక్ష రేసునుంచి వైదొలిగి ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌కు మద్దతివ్వడం సరైన నిర్ణయమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వసించినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ఎన్నికల నుంచి తప్పుకొని ఆయన స్థానంలో కమలను నిలబెట్టినందుకు ఆయన గర్వించారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ పేర్కొన్నారు. డెమోక్రాట్ల తరఫున పోటీ చేయడానికి కమల సిద్ధంగా ఉన్నారని ఆయన విశ్వసించినట్లు వెల్లడించారు.

అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రపంచ దేశాల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని, ముఖ్యంగా కొవిడ్ మూలంగా పాలనా సంబంధమైన విషయాల్లో అస్థిరత ఏర్పడిందని.. ఇది రాజకీయంగా బైడెన్‌కు నష్టం కలిగించిందని అనారు. పదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని అప్పట్లో బైడెన్ సమర్థించుకున్నారు. నియంత నిరంకుశల కంటే దేశం గొప్పదని బైడెన్ తెలిపారన్నారు. ఉపాధ్యక్షురాలు సమర్థురాలంటూ ఓవల్ ఆఫీసు నుంచి చేసిన ప్రసంగంలో బైడెన్ ప్రశంసించారు.