15 March, 2026 | 7:35 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ఆరిజోనా, నెవడాలో వెలువడని ఫలితాలు

09-11-2024 01:23 AM

రెండు రాష్ట్రాల్లో ఆలస్యం

న్యూయార్క్, నవంబర్ 8: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యం చాటుకొన్నా.. ఇంకా చిక్కుముడి మాత్రం వీడలేదు. అక్కడి ఆరిజోనా, నెవడాలో ఇంకా తుది ఫలితాలు వెలువడకపోవడమే ఇందుకు కారణం. నెవడాలో 6, ఆరిజోనాలో 11 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. నెవడాలో 2 దశాబ్దాల తర్వాత రిపబ్లికన్ల గాలి వీస్తుండగా, ఆరిజోనాలో గత రెండు ఎన్నికల్లో విభిన్న ఫలితాలు వచ్చాయి. నెవడాలో 94 శాతం ఓట్ల కౌంటింగ్ పూర్తకాగా రిపబ్లికన్లకు 51 శాతం, డెమొక్రాంట్లకు 47.2 శాతం ఓట్లు లభించాయి. ఆరిజోనాలో 70 శాతం కౌంటింగ్ పూర్తికాగా అందులో ట్రంప్ 52.3 శాతం, కమల 46.8 శాతం ఓట్లు సాధించారు.

జాప్యం ఎందుకు?

ఆరిజోనాలో చాలామంది మెయిల్ ద్వారా ఓట్లు వేశారు. వీటిని లెక్కించేందుకు కనీసం 10  రోజులు పడుతుందని అధికారులు వెల్లడించారు. నెవడా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు శనివారం కౌంటింగ్ కేంద్రాలకు చేరుతాయి. పోస్టల్ బ్యాలెట్ల సమస్యలను పరిష్కరించుకోడానికి నవంబర్ 12 వరకు తుది గడువు ఉంది.