calender_icon.png 6 December, 2024 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమనీయం.. లక్ష్మీనరసింహుడి కల్యాణం

02-11-2024 02:43:39 AM

నల్లగొండ, నవంబర్ 1 (విజయక్రాంతి): దామరచర్ల మండలం వాడపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి నక్షత్రం సందర్భంగా 726 ఏండ్ల తరువాత వేద పండితులు ఆలయ ప్రాంగణంలో కనుల పండువగా కల్యాణం జరిపించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి పీటలపై కూర్చోబెట్టారు.

వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాల నడుమ కమనీయంగా కల్యాణం జరిపించారు. ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భక్తులకు అన్నదానం చేశారు.