calender_icon.png 31 July, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రైతులకు అండగా ఉంటా

30-07-2025 11:31:46 PM

ప్రమాణస్వీకారంలో కమాన్ పూర్ ఎఎంసి చైర్మన్ వైనాల రాజు..

మంథని (విజయక్రాంతి): కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రైతులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటానని, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) సహకారంతో రైతుల సమస్యలు తీరుస్తానని కమాన్ పూర్ నూతన ఏఎంసి చైర్మన్ వైనాల రాజు అన్నారు. బుధవారం కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, డైరెక్టర్లు గుమ్మడి వెంకన్న, రఫీ, గట్టయ్య, ప్రవీణ్ కుమార్, పుల్లెల సతీష్, ఆరేళ్లి శ్రీనివాస్, ముసుగుల సురేందర్ రెడ్డి, జాగిరి సమ్మయ్య, సిద్ధ మురళీకృష్ణ, బి బుచ్చారావు, గుండా భాస్కర్, సురభి జగన్ మోహన్ రావు, ఇనగంటి భాస్కరరావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.

దీనికిగాను ఏఎంసీ పరిధిలోని కమాన్ పూర్, రామగిరి, ముత్తారం ,మండలాల నుండి ఎంపికైన డైరెక్టర్లు మరియు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైనాల రాజు మాట్లాడుతూ... మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రైతాంగానికి సాగునీటి సమస్య లేకుండా చూస్తానని అన్నారు. రైతులకు అందుబాటులో ఎరువులు అందేలా చూస్తానని, అలాగే రైతుల వార్డులు సకాలంలో కొనుగోలు చేసేలా చేస్తానని అన్నారు. అలాగే మార్కెట్ కమిటీకి కార్యాలయం తో పాటు వ్యవసాయ గిడ్డంగి ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు. ఈ ప్రమాణ స్వీకారం లో మాజీ ఎంపీపీ కోలేటి మారుతి , తొట్ల తిరుపతి యాదవ్, సాన రామకృష్ణారెడ్డి, రమణ కుమార్ రెడ్డి, నల్లవెల్లి శంకర్, కటకం రవీందర్, పిల్లి రాజు,తోకరి అశోక్ , చొప్పరి శేఖర్, భాద్రపు  శంకర్, రెబల్ రాజు,గంట వెంకటరమణారెడ్డి సదానందం, హర్ష ఎల్లయ్య, ముసుకుల సురేందర్ రెడ్డి, లల్లు, పిడుగు శంకర్ మథిన్ ఖాన్, పిడుగు శంకర్ వడ్లకొండ శంకర్, వడ్లకొండ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.