calender_icon.png 1 August, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల ఆకస్మిక తనిఖీ

31-07-2025 12:00:00 AM

- పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

- కలెక్టర్ సందీప్ కుమార్

ముస్తాబాద్, జూలై 30 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం తనిఖీ చేశారు.పాఠశాలలోని తరగతి గదులు, మ ధ్యాహ్న భోజనం వండే వంట గదులు, స్టోర్ రూమ్ లను స్వయంగా తిరిగి పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల హాజరు వివరాలు స్వయంగా పరిశీలించి అటెండెన్స్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలలో ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని తద్వారా అన్ అకాడమీ తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న బెంచీలను ఇతర పాఠశాలలకు, నిరుపయోగంగా ఉంచిన కుట్టు మిషన్ లను కలెక్టరేట్ కు తరలించాలని ఆదేశించారు.పాఠశాల ఆవరణలో గల ప్లే గ్రౌండ్ కు సిమెంట్ ఫ్లోరింగ్ చేయించాలని, విద్యార్డులు భోజనం చేయడానికి డైనింగ్ రూమ్ లో బెంచీలు ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు స మర్పిస్తే అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,అలాగే విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.

డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మత్తు చేయించాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో అం గన్వాడీ కేంద్రాలలో గోడలకు వైట్ వాష్ చేయాలని కలెక్టర్ పంచాయతి సెక్రటరీని అదేవిదంగా అంగన్వాడిలో లైటింగ్ సరిగా లేనందున వెంటనే ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.పాఠశాల ఆవరణలో గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటి కప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయాలని ,అదే విధంగా జిల్లాలోని అన్ని ప్రభు త్వ పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామని కావున వెంటనే గ్యాస్ స్టవ్ లను ఏర్పాటు చేసుకొని బిల్లులు కలెక్టరేట్ లో సమర్పించాలని ప్రధానోపాధ్యాయులకు తెలియజేశారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మండల విద్యాధికారి రాజిరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉ పాధ్యాయులు,సంబంధిత అధికారులు,స్థానిక నాయకులు భాను తదితరులు పాల్గొన్నారు.