calender_icon.png 1 August, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా అనాథ పిల్లలకి స్పాన్సర్‌షిప్

31-07-2025 12:00:00 AM

32 మంది లబ్దిదారులను ప్రాథమికంగా గుర్తింపు

ఇందిరమ్మ ఇళ్ళు,ఆరోగశ్రీ, రేషన్ కార్డు,హాస్టల్ వసతి కల్పించాలని ఆదేశం

రాజన్న సిరిసిల్ల జూలై 30 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల తల్లిదండ్రులను కోల్పోయిన 18 సంవత్సరాల లోపు బాలలకి స్పాన్సర్షిప్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 32 మంది లబ్ధిదారులను ప్రాథమికంగా గుర్తించి  ధ్రువపత్రాలను పరిశీలించడం జరిగింది. అలాగే వారి ఆర్థిక స్థితిగతులను పరిశీలించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొని విద్యార్థుల బాలలతో సం భాషించారు వారికి ఉన్న కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు.

వారి బాధలను చూసి వారిని ధైర్యంగా చదువుకొని ముందుకు వెళ్లి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి వివరాలను తెలుసుకొని వారికి కావలసిన సదుపాయాల గురించి ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజ్యంను ఆదేశించారు.అలాగే వారికి  ఇంటి జాగా స్థ లం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అవసరం ఉన్నవారి కి హాస్టల్ సదుపాయం కల్పించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలోచైల్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అంజయ్య, సభ్యులు కాజ మోహినోదీన్, డిహబ్ కోఆర్డినేటర్ రోజా, డిసిపిఓ కవిత ఎల్సిపిఓ అంజయ్య పిఓ ఎన్‌ఐసీ గగన్ పిఓ ఐసి రమేష్,  మొదలైన సిబ్బందిపాల్గొన్నారు...