calender_icon.png 9 November, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల బతుకుల్లో సంతోషమే ఈఎల్వీ ఫౌండేషన్ లక్ష్యం

09-11-2025 05:36:31 PM

ఈఎల్వీ చైర్మెన్ భాస్కర్..

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా ఈఎల్వీ యువత నిర్వహించిన ఈ సమ్మేళనానికి ఫౌండేషన్ చైర్మెన్ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించి ప్రాచీన శివాలయంలో పూజలు నిర్వహించి సమ్మేళనానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ స్పూర్తితో ఏప్రిల్ 14 న తమ ఫౌండేషన్ సేవలను విస్తరించామని ,పేద ప్రజల అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రారంభించామని తెలిపారు. నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు.

యువత  తమ కాళ్లపై తాము నిలబడేలా చేయుతనిస్తానని విద్యా వైద్యం ఉపాధి లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.ప్రతి గ్రామంలో తమ సభ్యులు సమస్యలను తీర్చడానికి పనిచేస్తున్నారని సేవ చేయడమే లక్ష్యంగా తాను పుట్టిన గడ్డపై ప్రజల కష్టాలను తీర్చడానికే తిరిగి వచ్చానని అన్నారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గంజాయికి బానిస అయ్యి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టిస్తే తమ ఫౌండేషన్ తరుపున 10వేల రూపాయలు బహుమతిగా అందజేస్తానని ప్రకటించారు.

ఘట్టుప్పల మండలంలో గోవుల సంరక్షణ కేంద్రాన్ని 12 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.నియోజక వర్గంలో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తను పరిష్కరిస్తానని ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన సాయం చేస్తానని తెలిపారు. నియోజకవర్గం మాత్రమే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తమ సేవలు ఉంటాయని తెలిపారు. రైతుల ధాన్యం కోసం అవసరమైన ఏర్పాట్లను చేస్తానని వికలాంగులకు అవసరమైన జీవనోపాధిని కల్పిస్తానని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఎల్వీ ఫౌండేషన్ సభ్యులు, వివిధ పార్టీల నేతలు, అధిక సంఖ్యలో నియోజక వర్గ యువత పాల్గొన్నారు.