కామారెడ్డి డిక్లరేషన్‌ను నెరవేర్చాలి
- బీసీ నాయకుల ఆమరణ దీక్షపై స్పందించాలె
- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ చేసిన కామా రెడ్డి డిక్లరేషన్‌ను వెంటనే నెరవేర్చాలని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కు మార్ డిమాండ్ చేశారు. కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏడు రోజులుగా ఆమర ణ దీక్ష చేస్తున్న బీసీ ఆజాదీ యువజన సంఘం అధ్యక్షుడు జక్కలి సంజయ్‌నేత, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్‌లను శనివారం వినోద్‌కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ నాయకుల ఆమరణ దీక్షపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
బీసీ నేతల ప్రాణాలకు ఏదైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించా లని మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాద వ్ హెచ్చరించారు. వాగ్దానాలు విస్మరించి దోచుకునే పనిలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బీసీ నాయకులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. బీసీ గణన జరిగిన తరువాతే స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. వారి వెంట వివిధ సంఘాల నాయకులు పిడికిలి రాజు, ఓబీసీ జేఏసీ చైర్మన్ అవ్వారు వేణుకుమార్, కొంగ ర నరహరి తదితరులు ఉన్నారు.






