ఏపీలో భారీ వర్షాలకు 9 మంది మృతి
- బండరాళ్లు విరిగి పడి విజయవాడలో ఐదుగురు
- కారు వాగులో పడి గుంటూరు జిల్లాలో ముగ్గురు
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుసుకున్నాయి. ఈ భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో 9 మంది మృతి చెందారు. గుం టూరు జిల్లా పెద్దకాకాని మండలం ఉప్పాలపాడులో వాగులో కారు కొట్టుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. విజయవాడలోని మొగల్‌రాజాపురంలో బండరాళ్లు విరిగి ఇళ్లపై పడటంతో ఐదుగురు మృతి చెందారు.
మేఘన, బొలెం లక్ష్మి, లాలు, అన్నపూర్ణతోపాటు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రం విచార వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పన పరిహారం ప్రకటించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న చోట నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు, మూ డు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






