22 July, 2026 | 10:48 PM

కంగనాను కొట్టిన కానిస్టేబుల్

07-06-2024 12:43 AM

చండీగఢ్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైతులను ఉగ్రవాదులు అన్నందుకు ప్రతీకారం!

చండీగఢ్, జూన్ 6: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో ఊహించని ఘటన జరిగింది. విమానాశ్రయంలోని చెకింగ్ పాయింట్ వద్ద సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ సినీనటి చెంప ఛెళ్లుమనిపించారు. గతంలో రైతు ఉద్యమకారులను ఉగ్రవాదులని కంగన విమర్శించారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కానిస్టేబుల్ దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై కంగన ఎక్స్‌లో రెండు వీడియోలు పోస్ట్ చేశారు. ‘నేను ఢిల్లీ వెళ్లేందుకు ఛండీగఢ్ విమానాశ్రయానికి వచ్చాను. చెకింగ్ పాయింట్ వద్ద వెయిట్ చేస్తుండగా.. ఓ కానిస్టేబుల్ నా వద్దకు వస్తూ దాడి చేశారు. చెంపపై కొట్టారు. ఇదేమిటని అడిగితే.. రైతు ఉద్యమకారులను ఎందుకు తిట్టావం టూ దూషించారు. పంజాబ్‌లో ఇదెక్కడి వేర్పాటువాదం?’ అని కంగన పేర్కొన్నారు. ఢిల్లీలో సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ నైనా సింగ్, మరికొందరు ఉన్నతాధికారులకు కంగ నా ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.