10-10-2025 01:15:46 AM
మక్తల్ అక్టోబర్ 9. మక్తల్ నియోజకవర్గం కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బహుజన సమాజ్ పార్టీ స్థాపకులు మాన్య వర్ కన్షీరామ్ వర్ధంతిని గురువారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భముగా మన్యవర్ కన్సీరామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనముగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి విశిష్టత అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జట్ల నరేందర్, నారాయణపేట జిల్లా ఇన్చార్జ్ గువ్వల తిరుపతి ,జిల్లా కార్యదర్శి బండారు చంద్రశేఖర్, హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన సన్మాన అవకాశం కల్పించి నా పార్టీ ఏదైనా ఉంది అంటే అది బహుజన సమాజ్ పార్టీ అని మనం నిక్కసిగా చెప్పుకునే పార్టీ అన్నారు.
రాబోవు రోజుల్లో బీఎస్పీ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు బి ఎస్ పి పార్టీ నుంచి స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా పార్టీని ఆదరిస్తారని వారి సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కె వి నరసింహ, అసెంబ్లీ ఇంచార్జ్ పాలెం వెంకటయ్య, ఉపాధ్యక్షులు పరుశురాం, కోశాధికారి నేరేడు మల్లికార్జున, కృష్ణ మండల అధ్యక్షులు చేగుంట మారెప్ప, మండల అధ్యక్షులు కట్ట నరసింహ, బిఎస్పి నాయకులు తదితరులుపాల్గొన్నారు.