10-10-2025 01:16:46 AM
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం బోర్ల గూడెం గ్రామంలో బంజారాల పండుగ తీజ్ ఉత్సవాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం మహిళలు ఆడుతూ పాడుతూ తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తుటీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బంజారా లు ఎంతో నిష్టతో ఈ తీజ్ ఉత్సవాలను నిర్వహిస్తారని వారందరికీ సుఖ సంతోషాలు కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి వావిళ్ళ పాపయ్య, నాయకులు శ్రీనివాస్, రామ్ సింగ్ నాయక్, కిషన్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.