calender_icon.png 9 November, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలి

09-11-2025 12:29:51 AM

  1. తేమ శాతాన్ని 12 నుంచి 20కి పెంచి పత్తిని కొనుగోలు చేయాలి
  2. అన్నదాతల డిమాండ్
  3. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో నిరసనలు

ఆదిలాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి)/మునిపల్లి: కేంద్రం తెచ్చిన కపాస్ కిసాన్ యాప్ రద్దు చేసి, తేమ నిబంధనలు లేకుండా పత్తి కొనాలని రైతులు డిమాండ్ చేస్తూ శనివారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై అన్నదాతలు బైఠాయించి రాస్తారోకో చేశారు. తేమ శాతాన్ని 12 నుంచి 20కి పెంచి పత్తిని కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పత్తి కర్రలను చేతబట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి, సీసీఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్ప డింది. బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఆడే వసంత్‌రావు మాట్లాడుతూ.. పత్తి రైతును తేమ శాతం పేరుతో సీసీఐ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.

కపాస్ కిసాన్ యాప్ ద్వారా సమస్యలు తప్పడం లేదన్నారు. తక్షణమే కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలని, తేమ శాతాన్ని 12 నుంచి 20కి పెంచి రైతుల వద్ద ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

సంగారెడ్డి జిల్లాలో

సీసీఐ తీసుకొచ్చిన కపాస్ యాప్‌తో ఇబ్బం దులు పడుతున్నామని, తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకో ల్ టోల్ ప్లాజా వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి.

బీఆ ర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు  సతీష్‌కు మార్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పా ర్టీ  మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, మండల సీనియర్ నాయకుడు బుర్కల పాం డు మాట్లాడారు. పాతనిబంధనలతో పత్తి కొనుగోళ్లు చేప ట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు  రైతుల తరుపున పోరాటం చేస్తా మని వారు తేల్చి చెప్పారు.

అంతకు ముందు ధర్నాచేస్తున్న విషయాన్నిసంగారెడ్డి డీఎస్పీ సత్త య్య గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా అక్కడకు  చేరుకున్నారు. కంకోల్ టోల్ ప్లాజా 65 జాతీయ రహదారిపై  ధర్నా చేయడంతో అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయి ఎక్కడి వాహ నాలు అక్కడ  నిలిచిపోయాయి. ఇం దులో భాగంగానే సీసీఐ సీఎండి లలిత్ కుమార్ గుప్తా రైతులను నిండా ముంచుతున్నారని, లలిత్ కుమార్ గుప్తా.. డౌన్  డౌన్ అంటూ  పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.