15 April, 2026 | 11:59 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజన సమారాధన

09-11-2025 10:01 PM

గజ్వేల్: గజ్వేల్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజనాలు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనాన్ని గజ్వేల్ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. గంగు దివాకర్ రావు వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏకాదశ రుద్రాభిషేకము, ధాత్రి నారాయణ కళ్యాణ మహోత్సవము గాయత్రీ మహిళా సంఘం సభ్యులచే లలితా సహస్రనామ, విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర్ శర్మ, కొండపోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షురాలు కప్పర అను గీత, నాచారం ట్రస్ట్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కమిటీ డైరెక్టర్ దేశపతి ఉషశ్రీ,  గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సంఘం సమాఖ్య అధ్యక్షులు దేశపతి శంకర్ శర్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, కోశాధికారి విటాల కృష్ణమూర్తి శర్మ,  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి నాగేంద్రరావు, రాజేశ్వరరావు, ఇన్ శ్యాంప్రసాద్,  యువజన సంఘం అధ్యక్షులు విటాల సాయి కృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్, కోశాధికారి రాఘవేంద్రరావు, పట్టణ పురోహితులు దేశపతి రాజశేఖర్ శర్మ, శర్మ, విటాల మురళీమోహన్ శర్మ గారు చిగుళ్ల సాకేత్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.