calender_icon.png 10 September, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలు

10-09-2025 10:56:49 AM

జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు(EVMs) భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత( tight security) నడుమ ఉందని జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములోని ఈవీఎంలను త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెల్సుకున్నారు. 

కలెక్టర్ మాట్లాడుతూ  ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాం తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే బుధవారం నాడు ఈవీఎం గోదాంలోని ఈవీఎంలను త్రైమాసిక తనిఖీ చేసినట్లు చెప్పారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, సీ సెక్షన్ సిబ్బంది రాజేష్, నాగేంద్ర, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి నుంచి శంకర్, కాంగ్రెస్ నుంచి త్రినాథ్, సిపిఎం నుంచి పరమేశ్వర్ చారి, బీజేపీ నుంచి కుమారస్వామి, బీ ఆర్ ఎస్ నుంచి జమీల్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.