13 July, 2026 | 7:50 AM

కవిత బెయిల్‌పై సోమవారం విచారణ

10-08-2024 12:41 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగనున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు జూలై 1న తిరస్కరించింది. ఆ తర్వాత ఆమె డిఫాల్ట్ బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసినా, కొద్ది రోజుల క్రితం ఉపసంహరించుకొన్నారు. తాజాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో సోమవారం నాటి విచారణ జాబితాలో చేర్చారు. ఇదే కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటంతో ఇప్పుడు కవిత బెయిల్ పిటిషన్‌పై ఆసక్తి నెలకొన్నది.