07-08-2024 02:42:42 AM
డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వాపస్ తీసుకొన్న ఎమ్మెల్సీ
న్యూఢిల్లీ, ఆగస్టు 6: లిక్కర్ కుంభకోణంలో అరెస్టయ్యి ఢిల్లీలోని తీహా ర్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఆమె ట్రయల్ కోర్టు లో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకొ న్నారు. బుధవారం దీనిపై తుది విచారణ జరుగనున్నది. అంతకుముందే పిటిషన్‌ను ఉపసంహరించు కొంటున్నట్టు కవిత న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
ఇతర మార్గాల ద్వారా బెయిల్ కోసం కోర్టును కోరే అవకాశాలున్నందున ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకొంటున్నట్టు తెలిపారు. తనపై మోపిన అభియోగా లకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో లోపాలున్నాయని కవిత జూలై ౬న పిటిషన్ దాఖ లు చేశారు. ఆ చార్జిషీట్‌లో లోపాలేమీ లేవన్న సీబీఐ వాదనకు సమ్మ తిస్తూ గత 22న దానిని పరిగణనలోకి తీసుకొంటున్నట్టు కోర్టు ప్రకటించింది. దీంతో కవిత తన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు.