07-08-2024 02:34:38 AM
పన్నులు కట్టకుండా అక్రమంగా హైదరాబాద్‌కు తరలింపు
ముంబై నుంచి వస్తుండగా మునిపల్లి వద్ద స్వాధీనం
సంగారెడ్డి, ఆగస్టు 6 (విజయక్రాంతి): ముంబై నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న బంగారు నగలను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం మునిపల్లి మండలంలోని 65వ జాతీయ రహదారిపై కంకోల్ టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేస్తుండగా ఎలాంటి పత్రాలు లేకుండ తరలిస్తున్న 4.8 కిలోల బం గారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ముంబైకి చెందిన పూర్ణచంద్రేశ్ అనే వ్యక్తి వద్ద ఈ బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. జూలై 26న జహీరాబాద్ మండలంలోని సత్వా ర్ శివారులో కోహినూర్ దాబా వద్ద నిలిపిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో నుంచి 3 కిలోల బంగారు నగలు దొంగలు దొంగతనం చేసిన విషయం తెలిసిందే.
ఆ సంఘటన జరిగి పది రోజులు కాకముందే బం గారం వ్యాపారులు మరోసారి అక్రమంగా హైదరాబాద్‌కు తరలి స్తుండగా అధికారులకు దొరకడం గమనార్హం. ప్రతి రోజు ముంబై నుంచి వందలాది ట్రావెల్స్ బస్సు లు రాకపోకలు సాగిస్తాయి. హైదరాబాద్, ముంబై మధ్య ట్రావెల్స్ బస్సుల్లో జోరుగా పన్నులు చెల్లించకుండా అక్రమంగా బంగారం తరలి స్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.