13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

భీమదేవరపల్లిలో పెట్రోల్ కొరత లేదు

26-03-2026 01:45 AM

సహకార బ్యాంకు అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి

భీమదేవరపల్లి, మార్చి 25 (విజయక్రాంతి) ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు పరిధిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం జరిగిందని ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. సహకార బ్యాంకులో ప్రవీణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సహకార బ్యాంకు పరిధిలో వేలాది మంది రైతులు ట్రాక్టర్ లో డీజిల్ అవసర ఉంటుందని ముందస్తుగా భావించి డీజిల్ నిల్వ చేయడం జరిగిందన్నారు. మండలంలో రైతులు ఎక్కువగా డీజిల్ తో పాటు పెట్రోల్ వాడకం అధికంగా ఉంటుందన్నారు.

రైతులు తమ ట్రాక్టర్లతో పాటు స్ప్రేయర్లు ఇతరత్రా వాడకం జరుగుతుందన్నారు. సహకార బ్యాంక్ పెట్రోల్ బంకులో ఎప్పటికప్పుడు పెట్రోల్ డీజిల్ ఇంధనం నిల్వ ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు అవసరం ఉన్నంత వరకే నిల్వలు చేసుకోవాలన్నారు. సహకార బ్యాంకు పెట్రోల్ పంపులో ఎప్పటికప్పుడు స్టాక్ తెప్పించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. సమావేశంలో ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి సంఘం జనరల్ మేనేజర్ మారుపాటి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.