calender_icon.png 10 May, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ వచ్చారు.. వెళ్లారు!

13-03-2025 12:53:38 AM

  1. గవర్నర్ ప్రసంగానికి హాజరై.. బీఏసీ సమావేశానికి గైర్హాజరై..
  2. బడ్జెట్ రోజు గులాబీ అధినేత వస్తారా.. లేదా? అని చర్చ

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసం గం పూర్తయిన వెంటనే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. స్పీకర్ అధ్యక్షతన జరిగే కీలకమైన బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది.

అయితే కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకాకుండానే వెళ్లిపోయారు. బీఏసీ సమావేశానికి బీఆర్‌ఎస్ నుంచి హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిలు హాజర య్యారు. కేసీఆర్ ఇలా వచ్చి.. అలా వెళ్లడంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా సభకు బాధ్యతగా హాజరుకావాల్సి ఉంద ని, కానీ తూతూ మంత్రంగా రావడమేంటని వారు ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయాక కేసీఆర్ కేవలం మూడుసార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి ఒకసారి, గత ఏడాది బడ్జెట్ సందర్భంగా మరోసారి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత బడ్జెట్ సమావే శాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు.

ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా బుధవారం హాజరైన కేసీఆర్.. మిగిలిన సెషన్ మొత్తానికి దూరంగా ఉంటారనే చర్చ జరుగుతోంది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్ సభకు హాజరవుతారనే చర్చ కూడా జరుగుతోంది. అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.