calender_icon.png 10 May, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన జర్నలిస్టులందరికీ తెల్ల రేషన్‌కార్డులు

10-05-2025 02:20:23 AM

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ తెల్లరేషన్ కార్డులు జారీ చేసేందుకు సత్వర చర్యలు చేపడుతామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీన స్థితిలో జీవితాలను కొనసాగిస్తున్న జర్నలిస్టులకు తెల్ల రేషన్‌కార్డులు అందించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ శుక్రవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.

వైఎస్‌ఆర్ హయాంలో అప్పటి ప్రభుత్వం జర్నలిస్టులకు తెల్లరేషన్ కార్డులు జారీ చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ తగు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.