calender_icon.png 10 May, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలూచ్ పతాకాలు ఎగరేసిన రెబల్స్

10-05-2025 02:15:34 AM

న్యూఢిల్లీ మే ౯: భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పౌర, మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణి దాడులతో పాకిస్థాన్ విఫల యత్నాలు చేస్తుండగా మరోవైపు పాకిస్థాన్ భద్రతా బలగాలపై బలూచిస్థాన్ తిరుగుబాటు దారులు తమ దాడులు పెంచారు. బలూచిస్థాన్‌లోని  అనేక ప్రాంతా లను అక్కడి సాయుధ తిరుగుబాటుదారులు తమ ఆనంలోకి తెచ్చుకున్నారు.

పలు ప్రాంతాల్లో పాక్ జెండాలు తీసేని బలూచిస్థాన్ స్వాతంత్య్ర పతాకాలను ఎగురవేశారు. శుక్రవారం ఫైజాబాద్‌లో బలూచ్ తిరుగుబాటుదారులు పాక్ దళాలపై దాడులు చేశారు. సిబ్బీలో  ఒక మిలటరీ క్యాంప్‌పై హాండ్‌గ్రెనేడ్ విసిరారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) పలు ప్రాంతాలలో  రాకెట్లతో దాడులు చేసింది.