calender_icon.png 10 May, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్యూట్ మురళీనాయక్

10-05-2025 02:06:39 AM

  1. భారత్-పాక్ దాడుల్లో   తెలుగు జవాన్ వీరమరణం
  2. జమ్మూకశ్మీర్‌లో శత్రువులతో పోరాడి మృతి
  3. 2022లో అగ్నివీర్‌కు ఎంపిక
  4. స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా కల్లితండా
  5. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సహా పలువురి సంతాపం
  6. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం 

హైదరాబాద్, మే 9: భారత్-పాక్ దాడు ల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీనాయక్ (25) లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శత్రువులను అడ్డుకొనే ప్రయత్నంలో ప్రాణాల ర్పించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మం త్రి లోకేశ్, పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ కుంటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రి సవిత మురళీ కుటుంబసభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందజేశారు.

మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డంతండా పంచాయతీ కల్లితండా గ్రామం. మురళీనాయక్ వీరమరణం పొందిన వార్త శుక్రవారం ఆయన కుటుంబసభ్యులకు చేరడంతో కల్లితండాలో రోదనలు మిన్నం టాయి. ఒక్కగా నొక్క కొడుకు ఇక లేడన్న చేదు వార్త విని మురళీ తల్లి జ్యోతిబాయి కన్నీరుమున్నీరుగా విలపించడం అందర్నీ కలిచివేసింది.

జ్యోతిబాయి, శ్రీరాములు నాయక్‌ల ఏకైక సం తానమే మురళీనాయక్.. సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. 2022, నవంబర్‌లో అగ్నివీర్‌కు ఎంపికై ఆర్మీలో చేరారు. నాసిక్‌లో శిక్షణ పొంది, జ మ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహించిన అనంతరం పంజాబ్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తు తం భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల క్రితం జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లారు.

అక్కడ శత్రువులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. మురళీనాయక్ తండ్రి శ్రీరాం నాయక్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. తన కుమారుడు చనిపోయేముందు పాకిస్థాన్ శత్రువులు దేశంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నారని తెలిపారు. 14 మంది శత్రువుల్ని మట్టుబెట్టినట్టు అధికారులు తనకు సమాచారం ఇచ్చారని వివరించారు. శనివారం స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అం త్యక్రియలు నిర్వహించనున్నారు.

కన్నీరుమున్నీరైన జ్యోతిబాయి

ఎన్‌వోసీ వద్ద జరిగిన కాల్పుల్లో జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందగా, తన ఒక్కగానొక్క కొడుకు మరణవార్త విని తల్లి, కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. మురళీనాయక్ అమ్మ జ్యోతిబాయి, అల్లారు ముద్దుగా కనిపెంచిన తన కొడుకు మురణాన్ని తట్టుకోలేక గుండెలు అవిసేలా రోది స్తోంది. మళ్లీ తన కొడుకును చూడలేనంటూ ఇంటికి వచ్చిన బంధువులను పట్టుకొని విలపిస్తుంది. అయితే, ఆమె కన్నీటిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. తమ గ్రామం నుంచి దేశరక్షణకు వెళ్లిన యువకుడు ఇలా విగతజీవిగా తిరిగిరావడాన్ని కల్లితండా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

త్యాగం వెలకట్టలేనిది: కేంద్ర మంత్రి బండి సంజయ్

పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో జవాన్ మురళీనాయక్ వీరమరణాన్ని యావత్ దేశం గుర్తించుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగం వెలకట్టలేదని, అది చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మురళీనాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్‌తో బండి సంజయ్ ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

దిగ్భ్రాంతిని కలిగించింది: సీఎం రేవంత్‌రెడ్డి  

జమ్మూ కశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

దేశరక్షణలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరం: సీఎం చంద్రబాబు

దేశరక్షణలో సైనికుడు మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీనాయక్‌కు నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.