10-05-2025 02:12:25 AM
పాకిస్థాన్ బుద్ధి మారలేదు. శుక్రవారం రెండోరోజూ తనతీరు మార్చు కోలేదు. మళ్లీ కవ్వింపులకు దిగింది. సరిహద్దులకు సమీపంలోని ౨౬ భారత్ నగరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో దాడికి దిగింది. దీంతో పలుచోట్ల విద్యుత్ నిలిపివేసి, పాక్ డ్రోన్ల పనిపట్టారు మన సైనికులు. సాయంత్రం నుంచే పాకిస్థాన్ సైనిక దళాలు భారత్ సైనిక, పౌర స్థావరాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని 26 నగరా లపై పాకిస్థాన్ డ్రోన్ దాడులు జరిగాయి.
దాయాది దాడులను మన సైనికులు సమర్థ వంతంగా తిప్పికొట్టారు. శ్రీనగర్ విమానాశ్రయంతో పాటు దక్షిణ కశ్మీర్‌లోని అవంతి పొరా ఎయిర్‌బేస్‌పై పాకిస్థాన్ డ్రోన్ దాడులకు విఫలయత్నం చేసింది. జమ్మూ కశ్మీర్ లోని సాంబ, రాజౌరి, బర్‌మెర్, కుప్వారా, పూంఛ్, యురి, నౌగామ్, హంద్వారా సెక్టార్లతో పాటు రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌పై కూడా డ్రోన్ దాడులు చేసింది. జైసల్మేర్‌లో 9, బర్‌మర్ ప్రాంతంలో ఓ డ్రోన్‌ను భారత సైన్యం కూల్చిసింది. పాక్ డ్రోన్ దాడులు మొదలు పెట్టగానే జమ్మూకశ్మీర్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, హర్యానాలోని అంబాలా, పంచకులా, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో బ్లాక్ అవుట్ చేశారు. కశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌లో పెద్ద ఎత్తున కాల్పులు, పేలుళ్లు వినిపిం చాయి. ఈ దాడుల్లో పలువురికి గాయాలయినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ గురువారం 36 ప్రాంతాల్లో దాదాపు 400 డ్రోన్లను
భారత్‌పైకి ప్రయోగించిందని విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఆ డ్రోన్లు టర్కీ దేశానికి చెందినవిగా తమ ప్రాథమిక పరిశోధనలో వెల్లడైందని, పాకిస్థాన్ సైనిక, పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు అధికారులు వివరించారు. ప్రార్థనా స్థలాల మీద దాడులు చేస్తూ తాము ప్రార్థనా స్థలాల జోలికి వెళ్లడం లేదని పాక్ చెబుతోందన్నారు. డ్రోన్ దాడులు చేసేందుకు పాకిస్థాన్ పౌరవిమానాలను కవచాలుగా ఉపయోగించుకుందని పేర్కొన్నారు. మరోవైపు ఐఎంఎఫ్ నుంచి భారీ రుణం తీసుకోవాలని యోచించిన పాకిస్థాన్‌కు భారత్ ఊహించని షాక్ ఇచ్చింది. బెయిలవుట్ ప్యాకేజీకి సంబంధించిన ఓటింగ్‌లో పాల్గొనలేదు. పాకిస్థాన్ టెర్రరిస్టులకు నిధులు సమకూరుస్తోందని భారత్ ఆరోపిస్తోంది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు వీలైనంత త్వరగా తగ్గుముఖం పట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నట్టు శ్వేతసౌధం పేర్కొంది. పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడటంతో చాలా ప్రాంతాల్లో బ్లాక్ అవుట్స్ కొనసాగాయి. జమ్మూ లోని పలు ప్రాంతాల్లో దాడుల నేపథ్యంలో బ్లాక్ అవుట్ విధించారు. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. కశ్మీర్ వ్యాలీలో అధికారులు బ్లాక్ అవుట్ విధించారు. పంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాక్ అవుట్ విధించారు. పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్‌లలో భారీ పేలుడు సంభవించిం ది. ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, హోషియాపూర్, ఫజిల్కా, ముక్త్‌సర్, సంగూర్ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేశారు. జమ్మూతో పాటు పఠాన్‌కోట్‌లో కూడా వరుసగా రెండో రోజు బ్లాక్ అవుట్ విధించారు. హర్యానాలోని అంబాలాలో కూడా బ్లాక్ అవుట్ విధించారు.
అమృత్‌సర్‌పై 15 డ్రోన్లతో దాడి
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కనీసం 15 డ్రోన్లతో దాడి జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఐదు వేర్వేరు ప్రాంతాల్లో ఈ డ్రోన్ దాడులు పాక్ తెగబ డింది. ఈ డ్రోన్లను బలగాలు నేలమట్టం చేశాయి. అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్ విధించినట్టు అధికారులు తెలిపారు. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. కొన్ని రాష్ట్రాలు అత్యవసర సిబ్బందికి సెలవులను రద్దు చేశాయి.
విమానాశ్రయాల మూత
దాడుల నేపథ్యంలో పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా సరిహద్దు ప్రాంతాలకు విమానసర్వీసులను కూడా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా మే 15వరకు 24 విమానాశ్రయాలను మూసేశారు. ఎయిర్ ఇండియా, ఇండిగోలు ఇప్పటికే పలు విమానాలను రద్దు చేసి.. వినియోగదారులకు రీఫండ్ కూడా మంజూరుచేశాయి. అమృత్‌సర్, లుథియానా, పటియాలా, భఠిండా, హల్వారా, పఠాన్‌కోట్, సిమ్లా, భుంటార్, శ్రీనగర్, చంఢీగఢ్ తదితర విమానాశ్రయాలను మూసివేస్తూ పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విమానాశ్రయాలను మూసివేయడంతో ఉత్తర రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. రైల్వే శాఖ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
మోగిన సైరన్లు
పాకిస్థాన్ డ్రోన్ దాడులకు పాల్పడటంతో కొన్ని ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగాయి. జమ్మూకశ్మీర్, పం జాబ్ మొదలైన ప్రాంతాల్లో బ్లాక్ అవు ట్ విధించారు. జమ్మూలో పాక్ డ్రోన్ల ను భద్రతా బలగాలు కూల్చేశాయి. పే లిన శబ్ధాలు వినిపించినట్టు జమ్మూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో ప్రకటించారు. కారుచీకట్లు కమ్ముకున్న చిత్రాన్ని కూడా షేర్ చేశారు. దాడుల నేపథ్యంలో జమ్మూ ప్రజలు ఇండ్లలోనే ఉండాలని అధికారులు ఆదే శా లు జారీ చేశారు.
పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి విఫలయత్నం
పాకిస్థాన్ పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై దాడికి విఫలయత్నం చేసింది. భారత బలగాలు సమర్థవంతంగా తి ప్పికొట్టాయి.
ఇంటిపై పడ్డ పాక్ డ్రోన్
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పాకిస్థాన్ డ్రోన్ ఓ ఇంటిపై కూలిం ది. దీంతో ఇంట్లోని వారికి గాయాలయ్యా యి. ఓ మహిళతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు కనిపించాయి. శ్రీనగర్‌పై పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లను భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది సమర్థవంతంగా తిప్పికొట్టారు. నగర వ్యాప్తంగా అనేక చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రాంతంలో మిలటరీ గస్తీ కొనసాగింది.